![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -458 లో..... కార్తీక్ కి శ్రీధర్ ఫోన్ చేస్తాడు. ఏంటోనని లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ఏంటి సర్ బిజీ ఆ.. నువ్వు చెప్పినట్టు చేసాను కదా.. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు .. అవసరం తీరిపోయిందా అని శ్రీధర్ అంటాడు. నీ పద్దతి నచ్చడం లేదు ఎన్నోసార్లు మార్చుకోమని చెప్పాను.. వినడం లేదు.. నీకు నచ్చని వాళ్ళు ఉంటే మాటలతో సాధిస్తావ్. అందరు నిన్ను తిడుతుంటే ఏదోలా ఉంది.. నువ్వు తప్పు చేసావ్ కాబట్టి తాత నిన్ను కొట్టాడు.. ఎప్పుడైనా తాతతో మర్యాదగా మాట్లాడావా.. ఆ ఒక్క తప్పు తప్ప శ్రీధర్ మంచివాడు అని అనుకునేలా చేసావా.. నువ్వు ఎలా నేను బాగుండాలి అనుకుంటావో నిన్ను కూడా అలాగే నేను అనుకుంటానని శ్రీధర్ తో కార్తీక్ ఎమోషనల్ గా మాట్లాడతాడు. శ్రీధర్ కంటతడి పెట్టుకుంటాడు. వీలైతే ఈ కొడుకు కోసం మారు అని చెప్పి కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు. నీ కోసం మారుతానురా అని శ్రీధర్ అనుకుంటాడు. మరొకవైపు స్వప్న, కాశీ ఇద్దరు సరదాగా బయటకు వెళ్తారు. కాశీకి జాబ్ పోయిందని తన మేనేజర్ కాల్ చేసి చెప్తాడు. కాశీ బాధపడుతుంటే స్వప్న ధైర్యం చెప్తుంది.
ఆ తర్వాత రెస్టారెంట్ నుండి కొంతమంది ఎంప్లాయిస్ శివన్నారాయణ దగ్గరికి వస్తారు. రెస్టారెంట్ లాస్ లో ఉందని చెప్తారు. వెంటనే అడిటర్ ని పిలిపించి అడుగుతారు శివన్నారాయణ. నష్టాల్లో ఉందని అతను చెప్తాడు. జ్యోత్స్న సీఈఓ అయినప్పటి నుండి లాభాలు రాలేదు.. సత్యరాజ్ రెస్టారెంట్ లాస్ లో ఉన్నదాన్ని కార్తీక్ నంబర్ వన్ చేసాడు.. అది నువ్వు తీసుకొని మళ్ళీ లాస్ లోకి తెచ్చావని జ్యోత్స్నపై శివన్నారాయణ కోప్పడతాడు. నీకు ఆరు నెలలు టైమ్ ఇస్తున్న ఆ లోపు రెస్టారెంట్ లాభాలలోకి రాకపోతే కొత్త సీఈఓ వస్తాడని శివన్నారాయణ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. నమ్మకం కోల్పోతే ఇలాగే ఉంటుందని జ్యోత్స్నతో సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |